శక్తి యాప్ పని తీరును ప్రత్యక్షంగా విద్యార్థులకు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జయరాం చూపించారు. బుధవారం నంద్యాలలోని రామకృష్ణ విద్యాసంస్థల ఆడిటోరియంలో అన్ని కళాశాలల విద్యార్థులతో సమావేశాన్ని నిర్వహించారు. శక్తి యాప్ పని తీరుపై ఓ విద్యార్థితో ఫోన్ చేయించగా ఐదు నిమిషాలలోపే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రతి ఒక్క విద్యార్థి శక్తి యాప్ను డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు.