అమరచింత: ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని అమరచింత మండలం ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన
ఉపాధి హామీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వనపర్తి జిల్లా అమరచింత మండలం MPDO కార్యాలయం ఎదుట సోమవారం మధ్యాహ్నం నిరసన చేపట్టారు. కూలీల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, పని ప్రదేశంలో టెంట్ సౌకర్యం, మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు S.అజయ్ అన్నారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉంచాలని వారం వారం పేస్లిప్పులు ఇవ్వాలని కోరారు.