జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ మంచిర్యాల పట్టణం రాజీవ్ నగర్ లో బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి మొక్కలు నాటారు.అనంతరం సేవ కార్యక్రమంలో భాగంగా రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజీవ్ నగర్ లో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఒకే దేశంలో రెండు జెండాలు రెండు రాజ్యాంగాలు ఉండవద్దు అనే నినాదంతో ఆర్టికల్ 370 రద్దు చేయాలని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు పోరాటం చేశారని అన్నారు. దేశ ప్రయోజనాల కోసం జన సంఘ్ స్థాపించి ప్రజల కోసం ప