ఒంగోలు: నగరంలోని 45 డివిజన్‌లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించిన ఒంగోలు మాజీ MLA దామచర్ల జనార్ధన్
బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ఆదివారం రాత్రి నగరంలోని 45వ డివిజన్లోని కర్నూల్ రోడ్డులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు నగర మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును గెలిపించి ముఖ్యమంత్రి చేయాలని కోరారు.