కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ గౌతమి, కమిషనర్ వంశి కృష్ణ భార్గవ్ ల లు పర్యటించారు. ఈ సందర్భంగా వారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేశారు. మరి కొన్ని సమస్యలను దశలవారుగా పరిష్కారం చేస్తామని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు.