కొల్లాపూర్: కొల్లాపూర్ ఎక్సైజ్ పరిధిలో ఇప్పటివరకు బెల్ట్ షాప్ లపై ఉక్కు పాదం 1081లీటర్ల సారా స్వాధీనం 15 మంది అరెస్ట్ సీఐ నాగిరెడ్డి
కొల్లాపూర్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని గ్రామాల్లో కొనసాగుతున్న బెల్టు షాపులు నాటు సారా కేంద్రాలపై ఉక్కు పాదం మోపినట్లు ఎక్సైజ్ సీఐ నాగిరెడ్డి తెలిపారు. గత నెల 16 నుండి ఏప్రిల్ 19వ తేదీ వరకు బెల్ట్ షాపులపై నాటసార స్థావరాలపై దాడులు నిర్వహించి 49 సార కేసులు నమోదు చేయగా సుమారు 1081 లీటర్ల నాటు సారాను 30 కిలోల బెల్లం రెండు బైకులు స్వాధీనం చేసుకొని 15 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు దాడుల నేపథ్యంలో 19050 లీటర్ల బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశామన్నారు 11 మందిని బైండ్ ఓవర్ చేసి అందులో ఒకరికి 5000 జరిమానా విధించామన్నారు