గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి 75 గజాల స్థలాన్ని పంపిణీ చేసింది. ఇల్లు కట్టుకునే వారికి ఆర్థిక సహాయం కూడా చేస్తానని ప్రకటించింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలు రావడం ప్రభుత్వ మాడడం జరిగిపోయాయి. ఈ క్రమంలో 75 గజాల స్థలంలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అధికారులు ఆ ఉసే మర్చిపోయారు.ప్రభుత్వం మారినా స్థలాల్లో రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఏర్పాటు చేస్తుందేమో అని ఆశతో లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.