రైతన్న మీకోసం కార్యక్రమాన్ని చేపట్టిన కలికిరి కేవికే శాస్త్రవేత్తలు
అన్నమయ్య జిల్లాలోని వివిధ మండలాల్లోని గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు శనివారం చేపట్టారు.ఇందులో భాగంగా కేవికే సమన్వయకర్త డాక్టర్ కె.మంజుల మరియు ఇతర శాస్త్రవేత్తలు వ్యవసాయ అనుబంధ శాఖలతో కలిసి పాల్గొని రైతులకు వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో వివిధ సూచనలు చేశారు. రైతులు వరిలో సేంద్రియ పద్ధతులైన పశువుల ఎరువు, జీవన ఎరువులు, అజొల్లా, వేప సంబంధిత మందుల పిచికారి, ఉపయోగించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చునని తెలిపారు.