హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలంలో శాశ్రోత్తకంగా కామ దహన కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులు.అర్చకులు.
శ్రీశైలంలో శాస్త్రోక్తకంగా కామదహనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఫాల్గుణ శుద్ధ చతుర్ధశిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు, వేదపండితులు, దేవస్థానం అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ముందుగా శ్రీస్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపించి, ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని మనోహరగుండం ఎదురుగా ఆశీనులను చేశారు. అనంతరం కర్పూరహారతులు సమర్పించి పల్లకీసేవ వైభవంగా నిర్వహించారు.ఈ పల్లకీసేవలో ఉత్సవమూర్తులను గంగాధర మండపానికి తీసుకువెళ్లి శాస్త్రోక్తకంగా మన్మథ రూపాన్ని దహనం చేశారు.శివుని తపస్సును భంగం చేయగా కోపోద్రిక్తుడైన పరమేశ్వరుడు మన్మథుని దహనం చేసిన సంఘటనకు గుర్తుగా ఈ కామదహనం నిర్వహించారు