కేవీఐసి ఆధ్వర్యంలో ఘనంగా 'ఆత్మనిర్భర్ భారత్' ఉత్సవం : కేవీఐసి ఛైర్మన్ మనోజ్ కుమార్
Anantapur Urban, Anantapur | Mar 27, 2026
ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యంతో స్వయం సమృద్ధి సాధించాలని భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల (MSME) మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీకి చెందిన కేవీఐసి ఛైర్మన్ మనోజ్ కుమార్ పిలుపునిచ్చారు.శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో అనంతపురం నగరంలోని న్యూటౌన్‌లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గ్రామొద్యోగ్ వికాస్ యోజన (GVY) కింద, విజయవాడలోని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) రాష్ట్ర కార్యాలయం వారు నిర్వహించిన శిక్షణ పూర్తి చేసుకున్న మొత్తం 430 మంది సాంప్రదాయ చేతివృత్తి కళాకారుల లబ్ధిదారులకు పంపిణీ చేశారు.