అనంతపురం జిల్లా పోలీసులు భారీ డంప్ ను స్వాధీనం చేసుకొన్నారు. జిల్లా ఎస్పీ జగదీష్ నేతృత్వంలో శుక్రవారం మధ్యాహ్నం నగరం లోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. 5 కంట్రీ మేడ్ పిస్టల్, ఒక ఖాళీ మ్యాగజీన్, 30 లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు.