డోన్ మండలం అబ్బిరెడ్డి పల్లె చెరువు సమీపంలో పొలాలకు వెళ్లే దారిని తవ్వడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా జేసీబీతో పెద్ద గుంతలు తవ్వి, మట్టిని రస్తాపై వేయడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రతిరోజూ పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు ఈ అకస్మాత్తు చర్యతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే గుంతలను పూడ్చి తమకు దారి సౌకర్యం కల్పించాలని బాధితులు అధికారులను కోరుతున్నారు. 5 132 చదవని వార్తలు