కల్వకుర్తి: మాచర్ల గ్రామంలో ఉచితంగా కంటి వైద్య శిబిరం... పలువురికి కంటి పరీక్షలు..
కల్వకుర్తి నియోజకవర్గం లోని మాచర్ల గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శ్రీ వీరభద్ర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించారు.. ఈ శిబిరంలో 120 మంది వృద్ధులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి మందులను అందజేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.. గ్రామస్తులందరూ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు...