పాణ్యం: రగ్బీ రాష్ట్ర స్థాయి పోటీల్లో కర్నూలు జిల్లా విజయం మీదివేముల ZP హై స్కూల్ స్వాతి, మైత్రి మెరుపు
NTR జిల్లా గన్నవరంలో జరిగిన రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో ఉమ్మడి కర్నూలు జట్టు విజేతగా నిలిచింది. మీదివేముల ZP హై స్కూల్ విద్యార్థులు స్వాతి, మైత్రి అద్భుత ప్రతిభతో జట్టుకు విన్నర్ కప్ అందించారు. వారికి శిక్షణనిచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ మల్లికార్జున, అరుణకుమారితో పాటు క్లాస్ టీచర్ శ్రీ రమణయ్యను ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస యాదవ్ గారు అభినందించారు.