మణుగూరు: అగ్నికి ఆహుతైన మిర్చి కల్లాన్ని పరిశీలించి, రైతు కుటుంబాన్ని ఓదార్చిన పినపాక MLA
పినపాక మం. వెంకటరావుపేట గ్రామం లో రైతు పొనగంటి పురుషోత్తంకు చెందిన ఆరబెట్టిన మిర్చి కల్లానికి ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో సుమారు 70 క్వింటాల మిర్చి దగ్ధం అయ్యింది. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గ్రామానికి చేరుకొని అగ్నికి ఆహుతి అయిన మిర్చి కల్లాన్ని పరిశీలించి రైతు కుటుంబాన్ని ఓదార్చారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని MLA హామీ ఇచ్చారు.