గుత్తి మండల శివారులోని పోతుదొడ్డి సమీపంలో శనివారం ఆటోను కారు ఢీకొన్న ఘటనలో మిడతూరుకు చెందిన రాజేష్, నవీన్ మృతి చెందగా ముగ్గురు గాయపడిన విషయం తెలిసిందే. మృతదేహాలను గుత్తి ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆదివారం ఆసుపత్రి మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. రాజేష్, నవీన్ భార్యలు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. విషాదం నెలకొంది.