ధర్మపురి: రేపు నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రి సీతక్క: క్యాంపు కార్యాలయంలో మీడియాకు వివరాలు తెలిపిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్
రేపు ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి సీతక్క పర్యటించనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆదివారం మీడియాకు వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మధ్యాహ్నం మూడు గంటలకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కేంద్రంలోని తెనుగువాడ నుండి ఎండపల్లి క్రాస్ రోడ్డు వరకు, బీటి రోడ్డు ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు పెగడపల్లి, ఎండపల్లి, వెల్గటూర్, గొల్లపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో బీటి రోడ్లకు శంకుస్థాపన చేస్తారన్నారు. ఆ తర్వాత పెగడపల్లి మండలం ఎల్లాపూర్ గ్రామంలో నూతన గ్రామా పంచాయితీ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారన్నారు