రాజేంద్రనగర్: శంషాబాద్ లో రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వస్తున్న ఇండిగో-అబుదాబి, బ్రిటిష్ ఎయిర్ లైన్స్-లండన్ విమానాలకు ఒకేసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమై ఇండిగో విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు. బ్రిటిష్ ఎయిర్ లైన్స్‌లో విమానాన్ని శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేసి, ప్రయాణికులను దించివేశారు. CISF బలగాలు బాంబ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేశారు.