సంక్రాంతి పండగకు నంద్యాల జిల్లాలో తయారు చేసే అరిసెలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు ఇంటింటా శ్రద్ధగా అరిసెలు తయారు చేస్తుండగా, ప్రస్తుతం అధునిక జీవనశైలి, సమయాభావం కారణంగా ప్రజలు పిండి వంటలను కొనుగోలు చేస్తున్నారు. కొందరు సంప్రదాయ వంటకాలపై ఆసక్తి తగ్గుతున్నప్పటికీ, సంక్రాంతి వేళ అరిసెలు చూపే ప్రాధాన్యం మాత్రం తగ్గలేదని మరికొందరు అంటున్నారు.