దుగ్గొండి మండలంలోని గిన్నిబావి వద్ద లారీ, బస్సు ఢీకొనడంతో పలువురికి గాయాలు
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లో ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్న ఘటన ఈరోజు మధ్యాహ్నం సోమవారం 3:00 గంటకు చోటుచేసుకుంది...ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దుగండి మండలం గిన్నిబావి వద్ద హనుమకొండ నుంచి నర్సంపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరంగల్ వైపు వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులో ఉన్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దుగ్గొండి పోలీసులు అక్కడికి చేరుకొని చేసిన నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.