ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడు గ్రామం వద్ద విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలం సేకరణకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సారవంతమైన భూములను ఇచ్చేది లేదంటూ రైతులు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు వ్యతిరేకిస్తూ రైతు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం ఎన్ని నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకొని ఉపసంహరించుకోవాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. లేదంటే నిరసనలు ఉద్యమాలు తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.