భూపాలపల్లి: ఇసుక అక్రమ రవాణాపై కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకోవడం ఖండిస్తున్నాం : బిజెపి జిల్లాకార్యదర్శి రాజేందర్
భూపాలపల్లి నియోజకవర్గంలోని టేకుమట్ల మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మండల బిజెపి నాయకుడు నాగరాజు ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా నిర్వహించినట్లు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగల రాజేందర్ తెలిపారు.ఈసందర్భంగా మాట్లాడుతూ గత రెండు మూడు రోజులుగా ఇసుక అక్రమ రవాణాపై కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకోవడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని,గతంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా వెలిశాల గుట్టల ఆక్రమణ కొనసాగుతుందని,వెంటనే అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని డిమాండ్ చేశారు.