జగిత్యాల: 4 దశాబ్దాలుగా మానవ సేవను మాధవ సేవగా భావిస్తున్నా,సామాజిక సేవతోపాటుగా ప్రజా సేవయే నా ధ్యేయం :ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 22 మందికి స్వతహాగా కంటి వైద్యులు, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం రాత్రి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశారు.ఈ సందర్బంగా ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పావని కంటి ఆసుపత్రిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఆపరేషన్లు చేసూకున్న వారికి తీసుకోవలసిన కంటి జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం వారికి కంటి అద్దాలు,మందులు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ...మానవ సేవను మాధవ సేవ గా భావిస్తాననీ, ఆ ధ్యేయంగానే సామాజిక సేవతోపాటుగా ప్రజా సేవ.