ఆత్మకూరు మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల సమయంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి శివశంకరయ్య ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగించాలని ఎమ్మార్వో లక్ష్మీ నాయక్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి శివ శంకరయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వి వి జి రామ్ జి పథకాన్ని ప్రారంభించడం జరిగిందని ఈ పథకాన్ని రద్దుచేసి 2006లో అమలైన మహాత్మా గాంధీజీ గ్రామీణ ఉపాధి హామీ పథకం యధావిధిగా కొనసాగించాలని లేకుంటే పోరాటాలు ఇచ్చేస్తామని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి శివశంకరయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జయమ్మ రాము వలి వెంకటమ్మ పాల్గొన్నారు.