పత్తికొండ: తుగ్గిలి మండలం సమీపంలో బస్సు బోల్తా వివరాలు పోలీసులు వెల్లడి
కర్నూలు జిల్లాలో శనివారం మరో ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు తుగ్గలి రైల్వే స్టేషన్ సమీపాన స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. దీంతో పొలాల్లోకి బోల్తా కొట్టింది. బస్సులో 29మంది ప్రయాణికులు ఉండగా.. కిరణ్, అనుశ్రీ అనే ఇద్దరికి చిన్న గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని సీఐ పులి శేఖర్, ఎస్ఐ బాల నరసింహులు పరిశీలించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.