రాయదుర్గం: గవిసిద్దేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో, ఏర్పాట్లు, బందోబస్తు పర్యవేక్షిఓచిన ఎస్ఐ
డి.హిరేహాల్ మండలంలోని సుప్రసిద్ధ శ్రీ గవిసిద్దేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలకు వేలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పోలీసులు పరిశీలించారు. గురువారం సాయంత్రం ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి దేవాదాయశాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో చర్చించి పలు సూచనలు చేశారు. క్యూలైన్ లు, బారికేడ్ల ఏర్పాటు, లైటింగ్, భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.