గుత్తి పట్టణ శివారులో ఈనెల 6వ తారీఖున బైకు అదుపుతప్పి బోల్తా పడి ప్రవీణ్, సురేష్ అనే ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడిన సంఘటన తెలిసిందే గత పది రోజులుగా అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రవీణ్ గురువారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు యువకుడు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపించారు.