రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి పీపీపీ విధానంపై వెనకడుగు వేసేదిలేదని మంత్రి స్వామి అన్నారు. ఒంగోలులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో పొందే సంస్థలకు ఫోన్లు చేసి మరీ బెదిరిస్తున్నట్లు మంత్రి ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు తగవని, కచ్చితంగాగా ప్రభుత్వం అనుకున్న తీరులో మెడికల్ కాలేజీల నిర్మాణం సాగుతుందన్నారు.