అమలాపురం మండలం కామనగరువు 216జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించడం వలన తరచూ ప్రమాదాలు జరుతున్నాయని శనివారం స్థానికులు ఆందోళన చేశారు. స్థానిక ఆమని ఆటో మొబైల్స్ సమీపంలో ప్రభుత్వ ఇసుక స్టాక్ పాయింటు ఏర్పాటు చేశారు. అక్కడ ప్రమాదాలు జరుగకుండా పెట్టిన బారికేడ్లను గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు.