ఆత్మకూరు మండలంలో జాతీయ రహదారి పనుల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కర్నూలు-గుంటూరు 340C నేషనల్ హైవే విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభంపై పని చేస్తున్న ఓకార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు.బాధితుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజు కుమార్ గా గుర్తించారు.ఆత్మకూరు మండలంలోని SRBC కాలనీ సమీపంలో హైవే పనులు జరుగుతుండగా, ఎలక్ట్రికల్ పోల్ ఎక్కిన రాజు కుమార్ ఒక్కసారిగా విద్యుత్ ప్రసారం కావడంతో విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. విద్యుత్ షాక్ ప్రభావంతో బాధితుడి శరీరం తీవ్రంగా కాలిపోయింది. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూల్ హాస్పిటల్ తరలించారు,