భూపాలపల్లి: పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు నియోజకవర్గం లోని పలు మండలాలకు చెందిన 167 మందికి 55 లక్షల 18 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించినట్లు ఎమ్మెల్యే గండ్ర తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని,ఈనేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.రానున్న రోజుల్లో మరిన్ని చెక్కులు పంపిణీ చేస్తామన్నారు ఎమ్మెల్యే గండ్ర.