దుబ్బాక: మిరుదొడ్డి లో శ్రీ సీతారాముల కళ్యాణం లో పాల్గొన్న MLA కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని రామాలయ దేవాలయంలో శ్రీ సీతరామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారామచంద్రుని అనుగ్రహం తో నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.