అమరచింత: కొంకినేనిపల్లెలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అజయ్
ఉపాధి హామీ పథకంలో గత రెండు నెలల బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అజయ్, మండల అధ్యక్షులు శంకర్ డిమాండ్ చేశారు. శనివారం ఉదయం అమరచింత మండల పరిధిలోని కొంకినేనిపల్లెలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. పని జరుగుతున్న ప్రదేశం వద్ద కూలీలకు కనీస వసతులు కల్పించాలని పేర్కొన్నారు.