భూపాలపల్లి: యూరియా అందించాలంటూ రోడ్డుపై రాస్తారోకో చేసిన రైతులు
భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలోని పరకాల భూపాలపల్లి జాతీయ రహదారిపై సోమవారం 10 గంటలకు రైతులు యూరియా కోసం రాస్తారోకో నిర్వహించినట్లు తెలిపారు రైతులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్ధరాత్రి నుంచి యూరియా కోసం వేచి చూస్తున్నా ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా యూరియా అందించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీంతో పోట్టకొచ్చిన వరి పంట దెబ్బతిని పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని వెంటనే అధికారులు స్పందించి యూరియా అందించాలని డిమాండ్ చేశారు రైతులు. రైతుల రాస్తారోకోతో భూపాలపల్లి పరకాల రహదారిపై వాహనాలు ఎక్కడికి ఎక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ అంతరం ఏర్పడింది.