ప్రకాశం జిల్లా దర్శి పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు కోట హనుమంతరావు జనసేన పార్టీలో చేరారు. సోమవారం మంగళగిరిలో ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో జనసేన పార్టీ కండువా వేసుకున్నారు. హనుమంతరావు అనుచరులు కూడా జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీ నాగబాబు జనసేన పార్టీ కండవని కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు.