ధర్మపురి: పట్టణంలో హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్
ధర్మపురి పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మే డే సందర్భంగా గురువారం రోజున తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులు, మండల నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... హెల్త్ క్యాంపును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని,ప్రతి ఒక్కరి ఇట్టి హెల్త్ క్యాంపును వినియోగించుకోవాలన్నారు.