దుబ్బాక: మేకల దొంగతనం చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన తొగుట పోలీసులు
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని మేకల దొంగతనాలకు అలవాటు పడిన ముగ్గురు వ్యక్తులను తొగుట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ వద్ద శనివారం ఉదయం వెహికిల్ ఛెకింగ్ చేస్తుండగా మేకలు దొంగతనం చేసే నిందితులను పట్టుకొని అరెస్టు చేసినట్లు తొగుట సీఐ ఎస్.కె లతీఫ్ తెలిపారు. AP 09AQ-4198 గల ఒక మారుతి ఆల్టో కార్ అనుమానస్పదంగా కనిపించి పోలీసు వారిని చూసి పారిపోతుండగా పట్టుకొని విచారించామన్నారు. నిందితులు మహమ్మద్ నసీరుద్దీన్, షాదుల్, సురేష్ వీరందరూ తూప్రాన్ గ్రామానికి చెందిన వారుగా తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు.