ఆలూరు: దేవనకొండ వడ్డే వీధిలోని ప్రధాన రహదారిపై మురుగునీరు ఇళ్ల ముందే
Alur, Kurnool | Dec 3, 2025 దేవనకొండ వడ్డే వీధిలోని ప్రధాన రహదారిపై మురుగునీరు ఇళ్ల ముందే ప్రవహిస్తూ దుర్వాసనతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై బుధవారం గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్య గురించి అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. తక్షణమే కాలువల ఎత్తు పెంచి రోడ్డుపై మురుగు పారకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.