గంగాధర నెల్లూరు: మోసపూరిత హామీలను తెలియజేయాలి: కార్వేటి నగరం మండలంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
సీఎం చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలను ఇంటింటా తెలియజేయాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కృపాలక్ష్మి పిలుపునిచ్చారు. కార్వేటి నగరం మండలం కొల్లగుంట వద్ద నిర్వహించిన సమావేశంలో శనివారం వారు మాట్లాడుతూ.. సంపద సృష్టిస్తామని చెప్పి రాష్ట్రాన్ని మరింత అప్పుల్లోకి నెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు హామీలు అందక ప్రజలు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు.