హిమాయత్ నగర్: చక్రవర్తి లక్కీషా బంజారా గొప్పతనం దేశవ్యాప్తంగా తెలియాలి: మాజీ ఎంపీ రవీంద్ర నాయక్
బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో భారత్ గోర్ బంజారా సేవా సమితి ఆధ్వర్యంలో చక్రవర్తి లక్కీ షా బంజారా జయంతిని శనివారం మధ్యాహ్నం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చక్రవర్తి లక్కీ షా బంజారా గొప్పతనం దేశవ్యాప్తంగా తెలియాలని అన్నారు. అందుకోసం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ తెలిపారు. అలాగే చక్రవర్తి లక్కీషా గురించి తెలంగాణలో స్టడీ సర్కిల్ మ్యూజియం ఏర్పాటు చేసి చరిత్రను పరిశోధించాలని తెలిపారు.