డోన్ చెరువు వద్ద క్షుద్ర పూజల కలకలం
Dhone, Nandyal | Dec 28, 2025 నంద్యాల జిల్లా డోన్ మండలం వెంకటాపురం చెరువు వద్ద ఆదివారం నిమ్మకాయలు, నల్లదారం, పసుపు- కుంకుమ, కొబ్బరికాయ ముక్కలు, బూడిదతో పాటు కొన్ని గుర్తు తెలియని బొమ్మలు చెల్లాచెదురుగా పడి ఉండటం వల్ల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఇవన్నీ చూసిన వారు క్షుద్ర పూజలకు సంబంధించినవేనని స్థానికులు అనుమానం వ్యక్త చేస్తున్నారు.