శ్రీకాకుళం: ప్రభుత్వ అధికారులపై రాజకీయ నాయకుల పెత్తనం అన్యాయం: ఎచ్చెర్ల జనసేన ఇంఛార్జి విశ్వక్సేన్
ప్రభుత్వ అధికారులపై రాజకీయ నాయకుల వేధింపులు తగధని ఏచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విశ్వక్ సేన్ అన్నారు. ఆదివారం ఏచ్చెర్ల ఏం.పి.డీ.ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు స్థాయిని మరచి అధికారులపై విరుచుకు పడడం అన్యాయమని తెలిపారు. ఇటీవల కడప జిల్లా గాలి వీడు ఎంపీడీఓ జవహర్ రెడ్డిపై దాడి ఘటన మరువక ముందే ఏచ్చెర్ల ఎంపీడీఓ పై మండల స్థాయి నాయకుడు బూతులు తిట్టి, చేప్పు చూపించి, చంపేస్థానని బెదిరించడం అన్యాయమని అన్నారు.