విశాఖపట్నం: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని సమిష్టిగా విజయవంతం చేద్దాం: కమిషనర్ కేతన్ గార్గ్
విశాఖపట్నం: సింహాచలం శ్రీ వరాహా లక్ష్మి నృసింహా స్వామి గిరిప్రదక్షిణ ఉత్సవాన్ని సమిష్టి గా విజయవంతం చేద్దామని జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ ఆకాంక్షించారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అధ్వర్యంలో రూపొందించిన ప్రణతోస్మి గిరిపౌర్ణమి ఆల్బమ్ ను మంగళవారం గ్రేటర్ కమిషనర్ కేతన్ గార్గ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక భక్తి భావముతో ముందుకు సాగుదామన్నారు. గిరిప్రదక్షిణ సందర్బంగా ప్రణతోస్మి గిరిపౌర్ణమి ప్రత్యేక ఆల్బమ్ ను రూపొందించడం అభినందనీయమన్నారు