అమరాపురం సమీపాన ద్విచక్ర వాహనం ఢీకొన్న గుర్తుతెలియని వాహనం ఓ వ్యక్తి మృతి
Anantapur Urban, Anantapur | Mar 29, 2026
శ్రీ సత్య సాయి జిల్లా అమరపురం సమీపాన ఆదివారం ఉదయం 8:30 గంటల సమయంలో ద్విచక్ర వాహనం ఢీకొన్న గుర్తుతెలియని వాహనం . ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న పెనుగొండ మండలం శెట్టిపల్లి తండా కు చెందిన గిరి నాయక్ అనే వ్యక్తి అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్యులు డాక్టర్ కార్తీక్ తెలిపారు. పెనుగొండ నుండి పావుగడకు వెళ్తుండగా అమరాపురం సమీపాన ప్రమాదం జరిగినది.ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.