ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామంలో వెలిసిన గొడ్రాలి కొండ తిరుమల స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు తిరుమలనాధుడు రాజ్యలక్ష్మి దేవి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గెలుపొందిన వారికి ప్రథమ ద్వితీయ బహుమతులు ఇస్తామన్నారు