ధర్మారం: గంగాపూర్, వెల్గొండ గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్న కలెక్టర్ సత్యప్రసాద్
భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుగ్గారం మండలం గంగాపూర్, వెల్గొండ గ్రామాలలో శుక్రవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డిఓ మధుసూదన్, తాసిల్దార్లు తదితరులున్నారు.