జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. నేరాలకు ముందస్తు నియంత్రణ సాధించడంతో పాటు ప్రజల్లో భద్రతా భావాన్ని మరింత పెంచేలా చర్యలు చేపట్టారు.జిల్లావ్యాప్తంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ, గంజాయి సహా నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు, నేర ప్రవృత్తులు కలిగిన వ్యక్తులపై గట్టి నిఘా కొనసాగిస్తున్నారు. నేరాలకు తావులేని జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రత్యేక బృందాలతో నిరంతర తనిఖీలు, గస్తీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.