గుమ్మగట్ట మండలంలోని బేలోడు గ్రామంలో శివ భక్తుల ఇరుముడి కార్యక్రమం మంగళవారం అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించారు. గ్రామంలోని శివాలయం వద్ద గ్రామస్తులు కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం ఇరుముడి కట్టి తలపై ఉంచుకుని శ్రీశైల మల్లికార్జున స్వామి ని దర్శించుకునేందుకు కాలినడకన బయలుదేరారు. శివనామ స్మరణతో వెంట నడుస్తూ శివ స్వాములను గ్రామస్తులు సాగనంపారు