నంద్యాల జిల్లా బనగానపల్లె హైస్కూల్ మైదానంలో జెన్ స్పోర్ట్స్ అండ్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ను సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ దుగ్గిరెడ్డి ప్రారంభించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, యువత క్రీడల్లో రాణించాలని సీఐ సూచించారు. శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు గణపం విజయ్ రెడ్డితో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.