మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం కొంగలవీడు ఎస్టి కాలనీలో సోమవారం కొండచిలువ కలకలం రేపింది. జనవాసాల నివాసాలకు అతి సమీపంలో ఆరు అడుగుల కొండచిలువ కనిపించడంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోయారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు అక్కడికి చేరుకొని కొండచిలువను చాకచక్యంగా బంధించారు. తర్వాత కొండచిలువను స్థానిక నల్లమల అటవీ ప్రాంతంలో అధికారులు విడిచిపెట్టారు. కొండచిలువను బంధించడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పాములు కనిపిస్తే చంపకుండా తమకు సమాచారం ఇవ్వాలని అటవీశాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.